హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మైనార్టీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ, జనరల్ కలుపుకొని మొత్తం 1022 పైగా గు రుకులాలున్నా ఒక్క ఎస్సీ సొసైటీలోనే అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. 3నెలలుగా తారాస్థాయికి చేరాయి. ఇటీవల ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల మరణాలు రాష్ట్రమంతటా ఆందోళన కలిగించగా, తాజాగా ఎస్సీ గురుకుల సొసైటీలోని ఉద్యోగులు వివిధ అంశాలపై రోడ్డెక్కడం చర్చనీయాంశమైంది. ఈ సొసైటీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నా సర్కారు స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. వివాదాలకు దారితీస్తున్న నిర్ణయాలన్నీ ప్రభుత్వానివేనా? లేక సొసైటీ సెక్రటరీ, ఉన్నతాధికారుల సొంత విధానాలా? అని ఉద్యోగ, ఉపాధ్యా య యూనియన్లు చర్చించుకుంటున్నాయి.
వరుసగా వివాదాలు
సొసైటీలో పవర్ సెంటర్లు..
వరుస వివాదాలకు సొసైటీ ప్రధాన కార్యాలయంలో పవర్ సెంటర్లుగా మారిన కొందరు ఉన్నతాధికారులే కారణమని ఉద్యోగులు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు చెందిన ఓ ఉన్నతాధికారిపై అనేక ఆరోపణలువస్తున్నాయి. కొత్తగా వచ్చిన సెక్రటరీని పూర్తి గా తప్పుదోవపట్టిస్తూ తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారని సిబ్బంది వి వరిస్తున్నారు. కావాల్సినవారికి ప్రధాన కార్యాలయంలోనే డిప్యూటేషన్లు ఇప్పించుకుని వారితో వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారని, ప్రశ్నిస్తే కక్షసాధింపులకు దిగుతున్నారని ఉద్యోగులు వెల్లడిస్తున్నారు. ఇటీవల సదరు ఉన్నతాధికారి అతిపై డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు, వెంటనే రిలీవ్ చే యాలని ఆదేశించినట్టు సమాచారం.
సర్కారు మొద్దునిద్ర
సొసైటీలో వరుస వివాదాలు తలెత్తుతున్నా సర్కారు మొద్దు నిద్ర వీడడం లేదు. జీవోలకు వ్యతిరేకంగా సొసైటీ ఉన్నతాధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నా సర్కార్ స్పందించకపోవడంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెదవివిరుస్తున్నారు. సొసైటీ ఉన్నతాధికారులు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.