Kaleshwaram | ఇదీ కాళేశ్వరం సమగ్ర స్వరూపం..
ఇదీ.. కాళేశ్వరం సమగ్ర స్వరూపం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీ-ఇంజినీరింగ్‌కు కారణాలు.. అంతర్ రాష్ట్ర అంశాలు తుమ్మిడిహట్టి బ్యారేజి వద్ద చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు పరిధి ముంపునకు గురికావడం.
Kaleshwaram | కాళేశ్వరం అంటే…
- 3 బ్యారేజీలు
- 15 రిజర్వాయర్లు
- 19 సబ్ స్టేషన్లు
- 21 పంప్ హౌజులు
- 203 కిలోమీటర్ల సొరంగాలు
- 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్
- 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్
- 141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ
- 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్
- 240 టిఎంసీల నీటి వినియోగం
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీ-ఇంజినీరింగ్‌కు కారణాలు.. అంతర్ రాష్ట్ర అంశాలు
- తుమ్మిడిహట్టి బ్యారేజి వద్ద చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు పరిధి ముంపునకు గురికావడం.
- తుమ్మిడిహట్టి వద్ద ప్రతిపాదించిన, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో 3,786 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం.
- ముంపు లేకుండా ఉండేందుకు, ఎస్ఆర్ఎల్ ను 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు వినతులు చేయడం.
- రెండు రాష్ట్రాలు నిర్వహించిన ఉమ్మడి సర్వేల్లో ఎఫ్ఆర్ఎల్ ను 148 మీటర్లకు తగ్గించడం వల్ల 285 ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతున్నట్టు తేలడం.
- గత కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఏడేండ్ల తర్వాత కూడా ఎలాంటి పనులు ప్రారంభించకపోవడం.
- 2007 నుంచి 2014 వరకు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ఒప్పందాలు చేసుకోకపోవడం. సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఎలాంటి అనుమతులు పొందకపోవడం.
నీటి లభ్యత అంశాలు
- తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) హైడ్రాలజీ విభాగం వారు కట్టిన లెకల ప్రకారం, తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అవసరాలకు తగినన్ని నికర జలాలు లేవని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణంపై పునరాలోచన చేసుకోవాలని సూచించడం.
- గోదావరి బేసిన్ లోని తెలంగాణ వాటా జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకొనేందుకు ప్రత్యామ్నాయ ప్రాంతం మేడిగడ్డ వద్ద 284.30 టీఎంసీల నీటి లభ్యత ఉందని గుర్తించడం.
రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం..
- ప్రాజెక్టులో ప్రతిపాదించిన జలాశయాల సామర్థ్యం తగినంతగా లేదని, కాబట్టి ప్రాజెక్టు అవసరాలకు జలాశయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలని, కొత్త జలాశయాలు నిర్మించుకోవాలని కేంద్ర జల సంఘం సూచనలు చేయడం.
- సమగ్ర అధ్యయనం తర్వాత, ప్రాజెక్టు అవసరాలకు అనుగుణంగా రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు, కొత్తవి ఏర్పాటు వల్ల రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 16.43 టిఎంసీల నుంచి 141 టీఎంసీలకు పెరగటం.
రెండు ప్రధాన విభాగాలుగా ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్
- డాక్టర్ బీఆర్ అంబేదర్ ప్రాణహిత ప్రాజెక్ట్
- 20 టీఎంసీలను మళ్లించి,ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు రూపొందించిన ప్రాజెక్టు.
కాళేశ్వరం ప్రాజెక్ట్
- మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం, మేడిగడ్డ, ఎల్లంపల్లి మధ్య మరో రెండు బ్యారేజీలు అన్నారం, సుందిళ్ల నిర్మించడం. కెనాల్స్, టన్నెళ్లు, లిఫ్ట్ సిస్టం, రిజర్వాయర్లు, డిస్ట్రిబ్యూటరీ నెట్వర్ ద్వారా గతంలో ప్రతిపాదించిన 16.40 లక్షల ఎకరాలకు బదులుగా 19.63 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడం.
- ఎస్సారెస్పీ, నిజాంసాగర్, సింగూరు, వరద కాల్వ, చెరువులు, చెక్ డ్యాంల కింద 18.82 లక్షల ఆయకట్టు స్థిరీకరణ.
- కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ద్వారా మొత్తం 38.45 లక్షల ఎకరాలకు సాగు నీరు.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు సవాళ్లు- సమస్యలు
- తుమ్మిడిహట్టి వద్ద ప్రతిపాదించిన, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో 3,786 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని మహారాష్ట్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడం.
- తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) హైడ్రాలజీ విభాగం వారి లెకల ప్రకారం, తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అవసరాలకు తగినన్ని నికర జలాలు లేవని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణంపై పునరాలోచన చేసుకోవాలని సూచించడం.
- ప్రాజెక్టులో ప్రతిపాదించిన జలాశయాల సామర్థ్యం తగినంతగా లేవని, కాబట్టి ప్రాజెక్టు అవసరాలకు తగినంతగా జలాశయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలని, కొత్త జలాశయాలు నిర్మించుకోవాలని కేంద్ర జల సంఘం సూచనలు చేయడం.
మహారాష్ట్ర సీఎంగా పృథ్వీరాజ్ చవాన్ లేఖ
- ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వల్ల 125 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వల్ల గడ్చిరోలి- చంద్రాపూర్ జిల్లాల్లోని 22 గ్రామాలకు చెందిన 2,099 హెక్టార్ల భూమి ముంపునకు గురవుతుంది.
ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఏకపక్ష ప్రణాళికల వల్ల చేస్తున్న ఖర్చు.. ఫలితం లేని వ్యయంగా మారుతుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహారాష్ట్ర అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖ
ఆంధ్రప్రదేశ్ సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి లేఖ
- ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని, అంతర్ రాష్ట్ర ఒప్పందాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తామని హామీ ఇస్తూ.. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మహారాష్ట్ర సీఎంకు లేఖ రూపంలో ఇచ్చిన సమాధానం.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఒప్పందం
- 8 మార్చ్ 2016న తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు నీటి విధానాలు, ప్రయోజనాల కోసం MOU చేసుకొన్నారు
టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్, రాజకీయ స్థాయిలో సమస్యల పరిషారం కోసం మూడు అంచెల సంస్థాగత యంత్రాంగం ఏర్పాటు
కేంద్ర ప్రభుత్వం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు లభించిన అనుమతులు
- కేంద్రంలో, మహారాష్ట్రలో, ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా ఏడేండ్ల కాలంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఒక అనుమతి కూడా సాధించలేదు.
- కానీ కేసీఆర్ ప్రభుత్వం ఒకే ఏడాదిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు సాధించింది
మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్ రావులతో కూడిన క్యాబినెట్ సబ్-కమిటీ రిపోర్ట్ గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను సమర్థంగా వినియోగించుకొనేందుకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చాలని సూచిస్తూ మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదిక అంశాలు.
ఇప్పటివరకు కాళేశ్వరం నీళ్లతో జరిగిన కొత్త ఆయకట్టు సాగు
- కాళేశ్వరం ద్వారా నేరుగా 98,570 ఎకరాలు.
- కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల ద్వారా నింపిన 456 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 39,146 ఎకరాలు కొత్త ఆయకట్టు.
- కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఎస్సారెస్పీ స్టేజ్-1, ఎస్సారెస్పీ స్టేజ్-2,నిజాంసాగర్ నీటితో నింపిన 2,143 మీడియం ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 1,67,050 ఎకరాలు కొత్త ఆయకట్టు.
- మొత్తం 3,04,766 ఎకరాలు కొత్త ఆయకట్టుకు నీళ్లు.
- ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అవసరాలకు తగినంత నీటి లభ్యత తుమ్మిడిహట్టి వద్ద లేదుఅని (18/02/2015) న సీడబ్ల్యూసీ తెలిపింది.
- ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అవసరాలకు తగినంత నీటి లభ్యత తుమ్మిడిహట్టి వద్ద లేదు. భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
- కాబట్టి నీటి లభ్యత విషయంలో సమీక్ష జరపాలి (04/03/2015)

ఆయకట్టు స్థిరీకరణ
- ఎస్సారెస్పీ-1 (ఎల్ఎండీ), ఎస్సారెస్పీ స్టేజ్ -2,నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లకు కాళేశ్వరం నీళ్లు అందించి 17,08,230 ఎకరాల స్థిరీకరణ.
- కాళేశ్వరం నీళ్లు కూడెల్లి వాగు, హల్దీ వాగుల ద్వారా 66 చెక్ డ్యామ్‌లతో మరో 20,576 ఎకరాలకు సాగునీరు.
- మొత్తం 20,33,572 ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు.
ఉమ్మడి పాలనకు, స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనకు ఇదీ తేడా..
- 2004-14 మధ్య కేవలం 5.71 లక్షల కొత్త ఆయకట్టు రాగా, 0.93 లక్షల ఆయకట్టును స్థిరీకరించారు. మొత్తం కొత్త, స్థిరీకరణ ఆయకట్టు కలిపితే 6.64 లక్షల ఎకరాలు.
- 2014-23 మధ్య 17.24 లక్షల కొత్త ఆయకట్టు రాగా, 31.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. మొత్తంగా కొత్త, స్థిరీకరణ ఆయకట్టు కలిపితే 48.74 లక్షల ఎకరాలు.
ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి కల్పన – వివరాలు
1956 నాటికి.. కొత్త ఆయకట్టు: 16.03 లక్షల ఎకరాలు 1956 నుంచి 2004 మధ్య..
- మేజర్ ఇరిగేషన్ : 19.01 లక్షల ఎకరాలు
- మీడియం ఇరిగేషన్ : 1.91 లక్షల ఎకరాలు
- మైనర్ ఇరిగేషన్ : 12.03 లక్షల ఎకరాలు
- టీఎస్ఐడీసీ : 3.18 లక్షల ఎకరాలు
- మొత్తం : 36.13 లక్షల ఎకరాలు
- 2004 నుంచి 2014 వరకు కొత్త ఆయకట్టు : 5.71 లక్షల ఎకరాలు
- స్థిరీకరించిన ఆయకట్టు : 0.93 లక్షల ఎకరాలు
2014-23 మధ్య స్వరాష్ట్రంలో సాగునీటి కల్పన..
- మేజర్ ఇరిగేషన్ : 14.46 లక్షల ఎకరాలు
- 1956 నాటికి.. కొత్త ఆయకట్టు:16.03 లక్షల ఎకరాలు
- మీడియం ఇరిగేషన్ : 0.59 లక్షల ఎకరాలు
- మైనర్ ఇరిగేషన్ : 0.60 లక్షల ఎకరాలు
- టీఎస్ఐడీసీ : 1.58 లక్షల ఎకరాలు
- మొత్తం కొత్త ఆయకట్టు : 17.24 లక్షల ఎకరాలు
- స్థిరీకరించిన ఆయకట్టు : 31.50 లక్షల ఎకరాలు
- 2014-23 మధ్య రాష్ట్రంలో కొత్త, స్థిరీకరించిన మొత్తం ఆయకట్టు 48.74 లక్షల ఎకరాలు
ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టు వివరాలు. కాళేశ్వరం కింద నూతన, స్థిరీకరించిన మొత్తం ఆయకట్టు 20,33,572 కేంద్ర జల సంఘం సూచనలుప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో ప్రతిపాదించిన జలాశయాల సామర్థ్యం తగినంతగా లేదని, కాబట్టి ప్రాజెక్టు అవసరాలకు తగినంతగా జలాశయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలని, కొత్త జలాశయాలు నిర్మించుకోవాలని కేంద్ర జల సంఘం సూచనలు..
కేంద్ర జల సంఘం సూచనలు
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో ప్రతిపాదించిన జలాశయాల సామర్థ్యం తగినంతగా లేదని, కాబట్టి ప్రాజెక్టు అవసరాలకు తగినంతగా జలాశయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలని, కొత్త జలాశయాలు నిర్మించుకోవాలని కేంద్ర జల సంఘం సూచనలు..
ధాన్యం కొనుగోళ్లు
- 2014-15లో 24.3 లక్షల మెట్రిక్ టన్నులు
- 2020-21లో 1.41 కోట్ల మెట్రిక్ టన్నులు
- పెరుగుదల శాతం 483.33 శాతం


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

