ప్రీలాంచ్ మోసం 100 కోట్లు!
హైదరాబాద్‌లో సొంతిల్లు ఉండాలనే మధ్య తరగతి ప్రజల కలను ఆసరాగా చేసుకొని పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రీ లాంచ్ అఫర్ల పేరిట భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే సమయంలోనే కొంత ,మొత్తం డబ్బు ఇస్తే ధర తగ్గుతుందనే ఉద్దేశంతో ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారిని నట్టేట ముంచుతున్నారు.
- టవర్లలో ప్లాట్లు మీవేనంటూ వసూళ్లు
- 18 నెలల తర్వాత రద్దు చేసుకోవచ్చు
- 8 శాతం వడ్డీ తిరిగి ఇస్తామని హామీ
- బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి
- బిచాణా ఎత్తేసిన అర్బన్ఉడ్ రియల్టీ సంస్థ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో సొంతిల్లు ఉండాలనే మధ్య తరగతి ప్రజల కలను ఆసరాగా చేసుకొని పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రీ లాంచ్ అఫర్ల పేరిట భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే సమయంలోనే కొంత ,మొత్తం డబ్బు ఇస్తే ధర తగ్గుతుందనే ఉద్దేశంతో ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారిని నట్టేట ముంచుతున్నారు. హైదరాబాద్ సీసీఎస్‌లో ఇప్పటికే పలు సంస్థలపై కేసులు ఉండగా, తాజాగా మరో కేసు నమోదైంది. సుమారు రూ. 100 కోట్ల వరకు మోసం జరిగినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్కెటింగ్ ఏజెంట్ల ద్వారా జూబ్లీహిల్స్‌లో కార్యాలయం నిర్వహిస్తున్న అర్బన్ఉడ్ రియల్టీ ఎల్ఎల్పీ సంస్థ ఎండీలు శ్రీనివాస్ మేక, గగన్‌దీప్ సింగ్ కోహ్లి, మేనేజర్ వెంకటేశ్ కొందూరిలను సోమాజిగూడకు చెందిన మెట్టు శశిభూషణ్‌రెడ్డి కలిశాడు. ఈ సంస్థ శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామంలోని సర్వే నంబర్ 9, 10, 11, 15, 16ఏ లో కొత్త ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తెస్తున్నదని, 2021 మార్చి నుంచి మొదలు పెడితే 42 నెలల్లోనే పూర్తి చేస్తుందంటూ నమ్మించారు. వాళ్ల మాటలను నమ్మి శశిభూషణ్ అందులో ఫ్లాట్ కొనేందుకు 30 శాతం అడ్వాన్స్‌గా రూ. 24.29 లక్షలు ఆన్లైన్లో చెల్లించాడు.
టవర్ 1లో ఫ్లాట్ నంబర్ 2304 రెండు కారు పార్కింగ్‌లతో 2075 ఎస్ఎఫ్టీకి ఎంవోయూ రాసుకున్నారు. 18 నెలల తరువాత ప్రాజెక్ట్‌పై నమ్మకం లేకున్నా, ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చని, అందుకు చెల్లించిన మొత్తానికి ఏడాదికి 8 శాతం వడ్డీతో తిరిగి ఇచ్చేస్తామంటూ ఒప్పందం చేసుకున్నారు. ఇటీవల ప్రాజెక్ట్ పరిస్థితి గురించి ఆరా తీసి, ఆ స్థలాన్ని శశిభూషణ్‌రెడ్డి సందర్శించాడు. బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తామంటూ హామీ ఇచ్చిన స్థలానికి గేట్ వేసి ఉండడం, ఆ స్థలం రాహుల్ రస్తోగిది అంటూ అక్కడున్న వారు చెప్పారు. దీంతో కంగుతిన్న శశిభూషణ్ సంస్థ నిర్వాహకుడైన శ్రీనివాస్ మేక గురించి ఆరా తీశాడు. భూ యజమానికి ఎలాంటి డెవలప్మెంట్ అగ్రిమెంట్ లేకపోవడం, ఇప్పటివరకు హెచ్ఎండీఏలో అనుమతులకు దరఖాస్తు చేయకపోవడంతో ఇదంతా మోసమని గుర్తించాడు. వెంటనే సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. తమ నుంచి రూ. 1.39 కోట్లు వసూలు చేసి మోసం చేశారంటూ సంస్థపై నలుగురు బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బాధితులు వందల సంఖ్యలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఇటీవల సాహితీ ఇన్ఫ్రా, భువనతేజ, జీఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థల మోసం మరువకముందే, తాజాగా మరో సంస్థ అందులో చేరింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

