బూర్గంపహాడ్, సెప్టెంబర్ 12 : వసతి గృహంలో నలుగురు విద్యార్థినులపై ఎలుకలు దాడి చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో శనివారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. సారపాకలోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల కళాశాల, వసతి గృహం ఒకే భవనంలో నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న రాత్రి నిద్రిస్తున్న విద్యార్థినుల కాళ్లపై ఎలుకలు దాడి చేశాయి. దీంతో గాయాలైన నలుగురు విద్యార్థినులను భద్రాచలం ఏరియా దవాఖానకు తరలించి చికిత్స చేయించారు.
ఈ నెల 3న సైతం ముగ్గురు విద్యార్థినులను ఎలుకలు గాయపరిచినట్టు సమాచారం. వసతి గృహం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతున్నా బయటకు పొక్కకుండా వైద్యం చేయించడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులు మండిపడుతున్నా రు. దీనిపై కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతిని వివరణ కోరగా.. ఎలుకలు దాడి చేసిన మాట వాస్తవమేనని, ఎలుకలు డ్రైనేజీ నుంచి వస్తున్నాయన్న విషయాన్ని స ర్పంచ్ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు.