మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ శివారులోని ఓ కాలువలో సోమవారం అరుదైన చేప లభ్యమైంది. అరమీటర్ పొడవుతో ఉన్న ఈ చేప దక్షిణ అమెరికా ప్రాంతం సంతతికి చెందినదని జడ్చర్ల డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ సదాశివయ్య తెలిపారు.
హైపోస్టోమస్ ప్లేకోస్టోమస్ అనే పేరు కలిగిన ఈ చేపను.. సాధారాణంగా సక్కర్ మౌత్ క్యాట్‌ఫిష్ అంటారని చెప్పారు.
– జడ్చర్ల టౌన్