హైదరాబాద్, నవంబర్ 16(నమస్తే తెలంగాణ): రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆదివారం రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలుగు రాష్ర్టాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్నాయుడు, బండి సంజయ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ఏడుగురికి అవార్డులు అందజేశారు. అవార్డులు పొందినవారిలో ఆమ్లా రుయా(గ్రామీణాభివృద్ధి విభా గం), శ్రీకాంత్ బొల్లా (యూత్ ఐకాన్ విభాగం), ప్రొఫెసర్ మా ధవీలత(సైన్స్ అండ్ టెక్నాలజీ), ఆకాశ్ టండన్(సర్వీస్ అండ్ మ్యాన్‌కైండ్), ప్రొఫెసర్ సత్తుపతి ప్రసన్నశ్రీ(ఆర్ట్ అండ్ కల్చర్), జయదీప్ హర్దీకర్(జర్నలిజం), పల్లభి ఘోష్(ఉమె న్ అచీవర్)ఉన్నారు.