హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్ కాలేజీలను రద్దు చేసి భూములను స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ సర్కార్ చూస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆరోపించారు. గురువారం రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న ఆయనను పోలీసులు హౌస్అరెస్ట్ చేశారు. తార్నాకలో రాంచందర్రావు మాట్లాడుతూ.. జీవో 97 రద్దు చేయాలని డిమాండ్ చేశారు.