చారిత్రక ‘రామప్ప’లో విధ్వంసం
ప్రకృతిని చీల్చి కోటానుకోట్లను మూటగట్టాలనే సింగరేణి ప్రతిపాదనతో రామప్ప గుడి, వేలాది ఎకరాలకు సాగునీటిని అందించే రామప్ప చెరువు విలవిల్లాడుతున్నాయి. బొగ్గు భీతావహంతో శిల్పరామం గజగజా వణికిపోతున్నది.
- చెరువు మధ్యన సాస్కీ పనులతో కూలుతున్న అనుబంధ గుడి
- విరిగిపడినవి గుడిమిట్ట శిల్పాలేనా?
వరంగల్, జూన్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రకృతిని చీల్చి కోటానుకోట్లను మూటగట్టాలనే సింగరేణి ప్రతిపాదనతో రామప్ప గుడి, వేలాది ఎకరాలకు సాగునీటిని అందించే రామప్ప చెరువు విలవిల్లాడుతున్నాయి. బొగ్గు భీతావహంతో శిల్పరామం గజగజా వణికిపోతున్నది. రామప్ప చెరువు మధ్య ఉన్న ద్వీపంలో సాస్కీ (స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ కాపిటల్ ఇన్వెస్ట్మెంట్-డెవలప్మెంట్ ఆఫ్ ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ టు గ్లోబల్ స్కేల్) పథకంలో భాగంగా చేపట్టిన పనులు గడువులోగా పూర్తి అవుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రామప్ప చెరువు ద్వీపంలో జరుగుతున్న పని ప్రదేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అప్రకటిత నిషేధ ప్రాం తంగా మార్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. సాస్కీ స్కీమ్‌లో భాగంగా చేస్తున్న పనుల సందర్భంగా కాకతీయ శిల్పాలు విరిగిపడ్డాయనే ప్రచారం జోరుగా సాగుతున్నది.

ఆ శిల లు తవ్వకాలవల్ల బయటపడ్డవి కాదని, ద్వీపం కొద్దిదూరంలో శిథిలావస్థకు చేరిన రామక్కగుడికి సంబంధించిన శిల్పాలు అయి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్ర స్తుతం కొనసాగుతున్న పనులకు కొద్దిదూరం లో విరిగిపడిన నంది విగ్రహం, పానవట్టం, పోగుపడిన శిల్పస్తంభాలు మట్టికుప్ప పక్కకు విసరివేయబడినట్టు ఉన్నాయి. ఈ ద్వీపంలో గుడి ఉన్న దాఖలాలు దేవాదాయ, పురావస్తు శాఖల రికార్డుల్లో లేకపోవడం గమనార్హం.
ద్వీపంలో చేపట్టిన పనులేవి?
2015 నుంచి 2021 దాకా కేసీఆర్ సర్కా ర్ చేసిన అవిరామ కృషి ఫలితంగా రామప్పగుడిని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం గా గుర్తించింది. దీంతో రామప్పతోపాటు నల్లమలలోని సోమశిల ఆధ్యాత్మిక కేంద్రం సాస్కీ స్కీమ్ కింద ఎంపికయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు పలు అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. రామ ప్ప రీజియన్ సస్టేయినబుల్ టూరిజం సర్క్యూట్లో భాగంగా రామప్ప ద్వీపంలో రూ.13కోట్ల అంచనాలతో పనులు చేస్తున్నా రు.
30 అడుగుల ఎత్తయిన నటరాజ విగ్ర హం, ఫ్లోటింగ్ జెట్టీ అండ్ వాటర్ స్పోర్ట్స్, వి శ్రాంతి గదులు, ఆటస్థలం, బట్టర్ ఫ్లై గార్డెన్ తదితర పనులు సాగుతున్నాయి. ఈ పనులను రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చేపట్టింది. పనుల నాణ్యత, పర్యవేక్షణ మాత్రం ప్రభుత్వ పెద్దలు ఎంపిక చేసినవారి ఆధీనంలో ఉందని, వారికి మాత్రమే సైట్ విజిట్ చేసే అవకాశం ఉండటంతో రామప్ప చెరువు ద్వీపంలో ఏం జరుగుతున్నది ఎవరికీ అంతుబట్టని రహస్యంగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mobile Blast | క్లినిక్‌లో పేలిన మొబైల్ ఫోన్.. భయంతో రోగుల పరుగులు.. Video
‘పట్టభద్రులు ఓటు నమోదులో భాగస్వాములు కావాలి’
ప్రజావాణికి స్పందన కరువు
Ar Rahman | అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు.. ‘రామాయణ’ విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

