హైదరాబాద్ ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్లో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య కొట్లాటలు చూస్తుంటే ఈ ప్రభుత్వం ఐదేండ్లు కొనసాగడం అనుమానమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీకైనా ప్రజలు ఐదేండ్లు పాలించే అవకాశం ఇస్తారని, కానీ ప్రస్తుత సర్కార్ పనితీరు బాగాలేక పోవడంతో మధ్యలోనే కూలిపోయినా ఆశ్చర్యం లేదని చెప్పారు.
హైదరాబాద్లోని ఆ పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ కొండా సురేఖ వ్యవహారంపై వ్యాఖ్యానించనంటూనే దోచుకోవడం ఎక్కువవుతున్నదని, దోపిడీ కొందరి చేతుల్లో కేంద్రీకృతం కావడంతోనే కొట్లాటలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ అంటనే కరెప్షన్ అని రుజువైందని తెలిపారు.