హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): తన తలను ఎవరైనా నరికి తీసుకొస్తే రూ.కోటి ఇస్తానంటూ ఓ న్యూస్ చానల్ డిబేట్లో బహిరంగంగా వ్యాఖ్యానించిన అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ కొలికపూడి శ్రీనివాసరావుపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌కు దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఫిర్యాదు చేశా రు. ‘వ్యూహం’ నిర్మాత, వైసీపీ నాయకుడు దా సరి కిరణ్‌తో కలిసి బుధవారం సాయంత్రం డీజీపీని కలిశారు. మంగళవారం రాత్రి టీవీ డిబేట్లో కొలికపూడి శ్రీనివాస్ తనను చంపితే రూ.కోటి ఇస్తానని చెప్పడం.. దాన్ని యాంకర్ మూడు సార్లు రిపీట్ చేయడం.. లైవ్‌లో కూ ర్చొని సుపారీ ఇవ్వడం.. తన ఇంటికొచ్చి తన ను తగులబెడతానని చెప్పడం దారుణమని చెప్పారు. హత్యారాజకీయాలను నివారించాల ని డీజీపీని కోరారు. తన హత్యకు కుట్రపన్నిన కొలికపూడి శ్రీనివాస్, టీవీ యాంకర్ సాంబశివరావు, చానల్ యజమాని బీఆర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.