హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : రాఖీ పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. హైదరాబాద్లోని జేబీఎస్, ఎంజీబీఎస్ బస్స్టేషన్లు, ఉప్పల్, ఎల్బీనగర్, కూకట్పల్లి, తార్నాక బస్స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది.
మరోపక్క సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్లకు కూడా ప్రయాణికుల తాకిడి పెరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుండే నగర రహదారులన్నీ రద్దీగా మారాయి. నగర శివారులో ఉన్న టోల్గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది.