హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్ గ్రామానికి చెందిన రాకేశ్‌రెడ్డి బిట్స్ పిలానీ సహా అ మెరికాలోనూ ఉన్నత విద్యను అభ్యసించారు. అమెరికాలో సిటీ బ్యాంక్ మేనేజర్‌గా, జేపీ మోర్గాన్, ఫేస్బుక్ సహా పలు అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీల్లో పనిచేశారు. రాజకీయాలపై మక్కువతో 2013లో బీజేపీలో చేరి బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. అసెం బ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్లో చేరారు. పట్టభద్రుల్లో రాకేశ్ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆయనను పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు.