Congress | దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలి : కాంగ్రెస్ నేత రాజు యాదవ్
Congress | దానం నాగేందర్‌కు( Danam Nagender ) ఎంపీ టికెట్ కేటాయించడంపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
హైదరాబాద్ : దానం నాగేందర్‌కు(Danam Nagender) ఎంపీ టికెట్ కేటాయించడంపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఆ పార్టీకి చెందిన మరోనేత దానంకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేయడం దుమారం రేపుతున్నది.కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ టికెట్ దానం నాగేందర్‌కు ఇవ్వడంపై కాంగ్రెస్ నేత రాజు యాదవ్(Raju Yadav) దానంపై విమర్శలు గుప్పించారు. బలమైన నేత అనుకుని టికెట్ ఇచ్చారు.
నా దృష్టిలో ఆయన బలమైన నేత కాదు అని ఆరోపించారు. పార్టీలు మారి వచ్చిన నేత రేపు గెలిస్తే పార్టీ మారడు అని గ్యారంటీ లేదన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీ టికెట్ ఎలా తీసు కుంటాడు? కాంగ్రెస్ హై కమాండ్ టికెట్ ఇచ్చింది కాబట్టి మేము వ్యతిరేకించడం లేదన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలని డిమాండ్ చేశారు. దానంపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ ముందు స్పీకర్ కి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
ఆయన చర్య తీసుకోలేదు కాబట్టి హైకోర్టులో(High Court) రిట్ పిటిషన్ దాఖలు చేశానని రాజు యాదవ్ తెలిపారు. దానం నాగేందర్ ఇలా పోటీ చేస్తే గెలవడు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తే గెలుస్తాడని చెప్పారు. దానం కోవర్ట్ కాదు అనిపించుకోవాలి అంటే ఆయన రాజీనామా చేసి పోటీ చేయాలి. లేందంటే దానం నాగేందర్‌ను మేము కోవర్టుగా భావిస్తామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

