యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకున్నది. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి గెలుపే లక్ష్యంగా రాష్ట్ర మంత్రులు, ఇన్చార్జులు దూసుకెళ్తున్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధే నినాదంగా.. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే ప్రచారాస్ర్తాలుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. రాజగోపాల్‌రెడ్డి మోసాలను తెలియజేశారు.
రాజగోపాల్ మోసాలనూ ఎండగడుతూ..
ఓ వైపు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను వివరిస్తూనే.. మరోవైపు రాజగోపాల్‌రెడ్డి మోసాలను ఎండగడుతున్నారు. అసలు మునుగోడుకు ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? దీనివల్ల ఎవరికి లాభం? బీజేపీ కుటిల రాజకీయాలు ఏమిటి? అని తెలియజేస్తూనే రాష్ట్రంపై కేంద్రం అక్కసును ఓటర్లకు వివరిస్తున్నారు. బుధవారం ప్రచారంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నా రు.ప్రచారానికి ప్రజలను నుంచి ఆదరణ లభిస్తున్నది. గ్రామాల్లో మహిళలు బొట్టుపెట్టి నాయకులను తమ ఇంటికి ఆహ్వానిస్తున్నారు. టీఆర్ఎస్ గెలుపు ఖాయమని, బీజేపీది మూడో స్థానమేనని స్పష్టం చేస్తున్నారు.
టీఆర్ఎస్లోకి చేరికల జోరు
సూర్యాపేట, నమస్తే తెలంగాణ: మునుగోడులో టీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగు తున్నది. నాంపల్లిలో 50 మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మంత్రి తలసాని సమక్షంలో కారెక్కారు. సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండలో 30 మంది బీజేపీ కార్యకర్తలను ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. చౌటుప్పల్‌లో మా జీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సమక్షంలో 30 మంది బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. చౌటుప్పల్‌లో ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ ఆధ్వర్యంలో 40 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు గులాబీ గూటికి చేరారు.
తెలంగాణలో అగ్గి రేపేందుకే ఉపఎన్నిక: జగదీశ్‌రెడ్డి
నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పచ్చని పంటలతో విరాజిల్లుతున్న తెలంగాణలో అగ్గి రాజేసేందుకే బీజేపీ ఉప ఎన్నికను తెచ్చిపెట్టిందని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఉప ఎన్నిక వెనక మోదీ, అమిత్‌షాల కుట్ర దాగి ఉన్నదని మండిపడ్డారు. మునుగోడు మండలం వెల్మకన్నె, చీకటిమామిడి గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రచారంచేశారు. ఎంపీ లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, వేమిరెడ్డి నర్సింహారెడ్డి, సీపీఐ, సీపీఎం నేతలు పాల్గొన్నారు.
చెప్పులు తొడగని సత్యవతి!
హైదరాబాద్‌లో గిరిజన, ఆదివాసీ ఆత్మగౌరవ భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించిన సందర్భంలో భావోద్వేగానికి లోనైన మంత్రిసత్యవతి రాథోడ్.. టీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చేవరకు తాను పాదరక్షలు ధరించనని ప్రకటించారు. బుధవారం సంస్థాన్ నారాయణపురం మండలం పొర్లగడ్డతండాలో కాళ్లకు చెప్పులు లేకుండానే ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ప్రచారం చేస్తూనే ప్రజలకు వైద్యం
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తరఫున ప్రచారం చేస్తూనే పలువురికి వైద్యసేవలు అందించారు స్టేషన్‌ఘన్‌ఫూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య. మర్రిగూడ మండలం ఇందుర్తిలో ఎమ్మెల్యే రాజయ్య బుధవారం ప్రచారం చేపట్టారు. ఈ క్రమంలో సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న పలువురికి వైద్యం చేశారు. ఇందుర్తిలో చేపూరి మమత అనారోగ్యంతో బాధపడుతుండగా స్లైన్ ఎక్కించారు. బాధితులకు చికిత్స అందిస్తున్న ఎమ్మెల్యేను గ్రామస్థులు అభినందిస్తున్నారు.
వృద్ధులకు పెద్ద కొడుకు కేసీఆర్
ఆసరా పింఛన్లు ఇస్తూ వృద్ధులను సీఎం కేసీఆర్ పెద్దకొడుకులా ఆదుకొంటున్నారని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. చౌటుప్పల్‌లోని 2, 3వ వార్డులు, తాళ్లసింగారం, కొత్తపేట, లింగోజిగూడెంలో బుధవారం ఎమ్మెల్యేలు బేతి సుభాష్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి ప్రచారం చేశారు. వృద్ధులతో మాట్లాడారు. ముత్తమ్మ అనే వృద్ధురాలు స్పందిస్తూ.. ‘నేను బతికి ఉన్నంత కాలం సీఎం కేసీఆర్‌కే ఓటేస్తా. మాకు కేసీఆర్ జీవగంజి పోస్తున్నడు. ఆసరా పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్నాడు.