హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 9 వరకు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. బంగాళాఖాతం నుంచి దక్షిణ ద్వీపకల్ప భారతదేశం, అలాగే బం గాళాఖాతంపై ద్రోణి వరకు బలమైన తూర్పు, ఈశాన్య గాలుల ప్రభావంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
నాగర్‌కర్నూలు, వనపర్తి, జోగులాంబ-గద్వాల్, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లా ల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీకి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నందున ఈ నెల 6వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.