Nepal floods: నేపాల్ వరదల్లో 1000 దాటిన మృతుల సంఖ్య
Nepal floods: నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య వెయ్యి దాటింది. కేవలం నేపాల్లో మృతిచెందిన వారి సంఖ్య 987కు చేరుకోగా, ఇక టిబెట్ మృతులతో కలిపితే ఆ సంఖ్య వెయ్యి దాటుతుంది. వరద ఉప్పొందిన దిగువ ప్రాంతాల్లో మృతదేహాలను వెలికితీస్తున్నారు.
కాట్మాండు: నేపాల్ వరదల్లో(Nepal floods) మృతుల సంఖ్య వెయ్యి దాటింది. కేవలం నేపాల్లో మృతిచెందిన వారి సంఖ్య 987కు చేరుకోగా, ఇక టిబెట్ మృతులతో కలిపితే ఆ సంఖ్య వెయ్యి దాటుతుంది. వరద వచ్చిన దిగువ ప్రాంతాల్లో మృతదేహాలను వెలికితీస్తున్నారు. గల్లంతు అయిన వారి సంఖ్య నాలుగు వేలు దాటింది. కేవలం నేపాల్లో 3916 మంది మిస్సయ్యారు. వారిలో 583 మంది విదేశీయులు ఉన్నారు. నేపాల్ ఆర్మీతో పాటు విదేశీ బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నాయి. చిత్వాన్ నుంచి సుమారు 321 మంది మృతదేహాలను రికవరీ చేసినట్లు నేషన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ పేర్కొన్నది. నవల్పారసి ఈస్ట్ నుంచి 216, నవల్పారసి వెస్ట్ నుంచి 170 మంది, నువాకోట్ నుంచి 95 మంది మృతదేహాలను రికవరీ చేశారు. గోర్కా నుంచి 65, దాడింగ్ నుంచి 55, తనహున్ నుంచి 38, రసువా నుంచి 27 మందిని వెలికితీశారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల సుమారు 8 జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

