మంచిర్యాల, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కోటగిరి/చందూరు/భీమ్గల్: ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జి ల్లా కేంద్రాలతో పాటు పలు మండలాల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాముదాకా జల్లులు పడ్దాయి. ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో సోమవారం 14.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిరుజల్లులకు ఆరబోసిన వరి, ఈదురు గాలులకు మామిడి రైతులకు ఇబ్బంది ఏర్పడిం ది. నిజామాబాద్ జిల్లా వర్ని, చందూరు, కోటగిరి, రుద్రూర్ మండలాలు, టాక్లీ, సోంపూర్, కొల్లూర్, సుంకిని గ్రామాల్లో సోమవారం వడగండ్ల వర్షం కురిసింది. పలుచోట్ల వరిపైర్లు దెబ్బతిన్నాయి.
వచ్చే ఐదు రోజులు వర్షాలు
ఎండలతో జనం అల్లాడిపోతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి వార్త చెప్పింది. మంగళవారం నుంచి ఐదు రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది.