నేడు పలుప్రాంతాల్లో ఉరుముల వాన
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఈ నెల 28 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానపడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
రాష్ట్రంలోకి నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయని చెప్పింది. రాగల 48 గంటల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని వివరిం చింది. గడిచిన 24 గంటల్లో 21 జిల్లాల్లో వర్షం కురి సింది. ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి.