Rainbow Hospital | హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) అనే అరుదైన కండరాల వ్యాధితో బాధపడుతున్న 10 నెలల పాపకు సికింద్రాబాద్‌లోని ‘రెయిన్బో’ హాస్పిటల్ వైద్యులు ప్ర పంచంలోనే అత్యంత ఖరీదైన జన్యు చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ కోనంకి రమేశ్ పర్యవేక్షణలో ఆ చిన్నారికి రూ.14 కోట్ల ఖరీదైన జోల్జె న్సా ఇంజెక్షన్‌ను ఇచ్చారు.
ఎస్ఎంఏ వ్యాధికి కారణమైన ఎస్ఎంఎన్-1 జన్యువును సరిచేసే ఈ మందును క్రౌడ్ ఫండింగ్ ద్వారా అమెరికా నుంచి తెప్పించినట్టు ‘రెయిన్బో’ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. 10 వేల మంది పిల్లల్లో ఒకరిని మాత్రమే ప్రభావితం చేసే ఈ వ్యాధితో మన దేశంలో వెయ్యి మంది చిన్నారులు బాధపడుతున్నట్టు తెలిపారు.