హైదరాబాద్ : నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తున్నది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వార్, బొల్లారం, జేబీఎస్, మారేడ్పల్లి, పాట్నీ సెంటర్లో వానపడుతున్నది. అలాగే చిలుకలగూడ, గుండపోచంపల్లి, కొంపల్లి, కూకట్పల్లి, ప్రగతినగర్, నిజాంపేటతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. వర్షంతో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఒడిశా తీరం, పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ఇవాళ వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలోనూ కొనసాగుతున్నది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం ఆవరించి ఉన్నది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.