హైదరాబాద్ : రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాయువ్య భారతం నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ ప్రాంతం వైపు గాలులు వీస్తున్నాయి. దీంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఈశాన్య రుతుపవనాలు వెనక్కి వెళ్లిపోయానని వాతావరణ శాఖ వివరించింది.