హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ‘‘ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఆవరించిన ద్రోణి బలహీనపడింది. నైరుతి దిశ నుంచి రాష్ట్రంలోకి కిందస్థాయి గాలులు వీస్తున్నాయి’’ అని వాతావరణశాఖ వెల్లడించింది. రాగల 2,3 రోజుల్లో దక్షిణ తెలంగాణ జిల్లాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.