హైదరాబాద్, అక్టోబర్11(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ నెల15 వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉపరితల ద్రోణి ఇంటీరియర్ కర్ణాటక నుంచి మరాఠ్వాడా, విదర్భ మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు కొనసాగుతున్నదని పేర్కొన్నది. దీనికితోడు నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైందని తెలిపింది.