హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): వాణిజ్య పన్నులశాఖ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి రఘునందన్‌రావును ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వి స్వచ్చంద పదవీ విరమణ(వీఆర్ఎస్) చేయడంతో ఆయన స్థానంలో రఘునందన్‌రావుకు అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.