నిజామాబాద్ : నిజామాబాద్(Nizamabad )ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్ని ర్యాగింగ్ (Ragging)చేసి సీనియర్స్ దారుణంగా కొట్టారు. వివరాల్లోకి వెళ్తే..రాహుల్ రెడ్డి అనే మెడికల్ విద్యార్థిపై సీనియర్స్ దాడికి పాల్పడ్డారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నుంచే రాహుల్ రెడ్డిపై ర్యాగింగ్ చేసిన అతడు భరిస్తూ వచ్చినట్లు తెలిసింది. రాహుల్ రెడ్డి పోస్టింగ్‌కు వెళ్లినా విద్యార్థి సాయిరాం పవన్ ఆబ్సెంట్ వేశాడు.
దీనిపై మాట్లాడడానికి వెళ్తే ఒక రూంలోకి పిలిచి 10 మంది సీనియర్లు రాహుల్ రెడ్డిపై దాడి చేశారు. జాండిస్ వచ్చిందని రిపోర్టులు చూపించినా వదలకుండా ర్యాగింగ్ చేసినట్లు రాహుల్ రెడ్డి తెలిపారు. దాడికి పాల్పడ్డ సీనియర్ హౌస్ సర్జన్స్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని జూనియర్ మెడికోలు డిమాండ్ చేశారు.
నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్స్ని ర్యాగింగ్ చేసి దారుణంగా కొట్టిన సీనియర్స్
ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నుండి విద్యార్థి రాహుల్ రెడ్డిపై ర్యాగింగ్ చేసిన సీనియర్స్.. భరిస్తూ వచ్చిన విద్యార్థి
సీనియర్స్ ఇంటర్న్‌షిప్ చేస్తూ అదే కాలేజీలో ఉండి, రాహుల్ రెడ్డిని నాలుగో… pic.twitter.com/rB4y0BA5TV
— Telugu Scribe (@TeluguScribe) August 24, 2025