Rachakonda She teams | ఈవ్‌టీజింగ్, మహిళల వేధింపుల కేసులో ఆరు వారాల్లో 125 మంది అరెస్ట్
ఈవ్‌టీజింగ్, వేధింపుల కేసులో 125మందిని అరెస్ట్ చేసిన రాచకొండ షీ టీమ్స్
హైదరాబాద్: హైదరాబాద్‌లో మహిళల భద్రతకోసం ఏర్పాటు చేసిన షీ టీమ్ బృందాలు సమర్థంగా పనిచేస్తున్నాయి. ఆకతాయిల వేధింపుల గురించి సమాచారం అందిన వెంటనే షీ టీమ్స్ రంగంలోకి దిగడమే కాకుండా మహిళలు, అమ్మాయిలకు భరోసాని ఇస్తున్నాయి. ఈ ఆరువారాల్లో షీ టీమ్స్ బృందాలు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళల్ని వేధిస్తున్న125 మందిని అరెస్ట్ చేశాయి. దాదాపు 91మందిపై కేసు నమోదుచేశామని, 28 మందిపై ఎఫ్ఐఆర్ రిజిష్టర్ చేశామని చెప్పారు షీ టీమ్స్ అధికారి. నేరుగా, వాట్సాప్ నెంబర్ ద్వారా, వెబ్సైట్ ద్వారా అందిన ఫిర్యాదుల ఆధారంగా మహిళల్ని వేధిస్తున్న వాళ్లను అరెస్ట్ చేశామని షీ టీమ్స్ అధికారులు చెప్పారు.
74 మంది మైనర్లు
మెట్రో స్టేషన్లు, పనిచేసే చోట, కాలేజీల్లో ఆకతాయిల వేధింపులపై షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు కొందరు. దాంతో, రంగంలోకి దిగిన షీ టీమ్స్ ఆరువారాల్లో 125మందిని అరెస్ట్ చేశాయి. వీళ్లలో స్కూల్ టీచర్‌తో సహా 74మంది మైనర్లు ఉన్నారు. మహిళల్ని వేధిస్తూ పట్టుబడ్డ వీళ్లకు ఎల్బీనగర్లోని కమిషనరేట్ కార్యాలయంలో కౌన్సిలర్లు,సైకాలజిస్ట్లతో కౌన్సెలింగ్ ఇప్పించనున్నారు. మైనర్లకు మాత్రం విడిగా కౌన్సెలింగ్ ఇప్పించనున్నారు. షీ టీమ్స్‌కి పట్టుడ్డ వాళ్లందరూ ఈ కౌన్సెలింగ్ సెషన్‌కు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు అధికారులు.
155 బాల్యవివాహాల్ని అడ్డుకున్నాం
మెట్రో స్టేషన్లలో మహిళల కోసం కేటాయించిన కంపార్ట్మెంట్లలో ప్రవేశించిన 12మందికి షీ టీమ్స్ ఫైన్లు వేశాయి. అంతేకాదు తమ బృందాలు గత ఆరువారాల్లో మూడు బాల్యవివాహాల్ని ఆడ్డుకున్నాయి. కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకూ 155 బాల్యవివాహాలు జరగకుండా చూశామని షీ టీమ్స్ అధికారి ఒకరు చెప్పారు. ఈవ్‌టీజింగ్ వంటి వేధింపుల గురించి మహిళలు, అమ్మాయిలు 100 నెంబర్‌కు ఫోన్ చేసి లేదా వాట్సాప్ నెంబర్ 9490617111 ద్వారా ఫిర్యాదు చేయాలని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

