హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ)/జియాగూడ/శాలిగౌరారం/కాగజ్‌నగర్: కాంగ్రెస్ పదిహేను నెలల పాలనలో అన్నిరంగాల్లో విఫలమైందని విమర్శలు ఎదుర్కొంటున్నది. రేవంత్ సర్కార్‌కు కనీసం టెన్త్ పరీక్షలు కూడా నిర్వహించడం చేతకావడం లేదని విపక్షాల నేతలు, విద్యార్థులు, విద్యావేత్తలు మండిపడుతున్నారు. పదోతరగతి పరీక్షలు మొదలైనప్పటి నుంచి రోజుకోచోట ప్రభుత్వ వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పరీక్షలు జరిగిన నాలు గు రోజుల్లో నాలుగు లీకేజీలు, తప్పిదాలు బయటపడ్డాయి. మరో మూడు పరీక్షలు జరగాల్సి ఉండగా, వీటిలో ఎన్ని తప్పిదాలు వెలుగుచూస్తాయో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖ సీఎం వద్దే ఉన్నా పరీక్షల నిర్వహణపై ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదని, అందుకే పరీక్షల నిర్వహణలో వరుస తప్పిదాలు జరుగుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. పరీక్షల నిర్వహణలో తప్పిదాలతో రేవంత్ ప్రభుత్వం ‘టెన్త్ ఫెయిల్ సర్కార్’గా విమర్శలు ఎదుర్కొంటున్నది.
టెన్త్ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు ఒక్కొక్కటికిగా బయటపడుతుంటే సరిదిద్దుకోవాల్సిన సర్కారు నిలదీసిన వారిపై కేసులు పెట్టడం దారుణమని బీఆర్ఎస్ నేతలు ఆగ్ర హం వ్యక్తంచేస్తున్నారు. నకిరేకల్ లీకేజీ వ్యవహారంపై సోషల్ మీడియాలో పోస్ట్పెట్టి, ప్రభు త్వ చేతగానితనాన్ని బయటపెడితే కక్షసాధింపులెందుకని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ నేతలు మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్‌పై మూడు కేసులు పె ట్టడం దారుణమని మండిపడుతున్నారు. వీటి లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును జోడించడం దుర్మార్గమని నిప్పులు చెరుగుతున్నారు.
విద్యాశాఖను తన వద్దనే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆరోపించారు. పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ, నిర్వహణలో లోపాలను నిరసిస్తూ గురువారం బీఆర్ఎస్వీ నేతలు, విద్యార్థుల ఆధ్వర్యంలో ఎస్సెస్సీ బోర్డును ముట్టడించారు. పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసలు నిందితులను పోలీసులు తప్పిస్తూ, బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శలు గుప్పించారు.
మొదటిరోజు పరీక్ష సందర్భంగా నకిరేకల్ లో గుర్తుతెలియని వ్యక్తులు ఎస్ఎల్బీసీ గురుకుల పాఠశాల సెంటర్లోకి ప్రవేశించి, విద్యార్థి ని ప్రశ్నపత్రాన్ని లాక్కుని, ఫొటో తీసుకుని, వా ట్సాప్లో సర్క్యులేట్ చేశారు. ఈ ఘటనలో అ ధికారులు డిబార్ చేశారు. పేపర్ లీకేజీ కేసులో తనకు సంబంధం లేదని, ఎవరో ఎగ్జామ్ సెంటర్లోకి వచ్చి పేపర్ లాక్కుంటే తనపై చర్యలు తీసుకోవడం సరికాదంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు గురువారం ఆమె తరఫున న్యాయవాది హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు అన్యాయం జరిగిందని, పరీక్షకు అనుమతివ్వాలని కోరు తూ పేర్కొన్నారు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, నల్లగొండ డీఈవో, బోర్డ్ సెక్రటరీ, నకిరేకల్‌లోని పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
పేపర్ లీకేజీ స్కామ్ నుంచి తప్పించుకొనేందుకు సీఎం రేవంత్ అడ్డదారులు తొక్కుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆ రోపించారు. ఈ కుట్ర కోణంలో భాగంగానే ఎస్సీ, ఎస్టీల పక్షాన పోరాడుతున్న కేటీఆర్‌పై ఫేక్ అట్రాసిటీ కేసు పెట్టారని ధ్వజమెత్తారు.