NAAC | హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉన్నత విద్యలో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు గల కాలేజీల సం ఖ్యయే నిదర్శనం. 88శాతం కాలేజీలు న్యాక్ గుర్తింపును దక్కించుకోలేదు. ఈ విషయం లో రాష్ట్రంలోని కాలేజీలు అత్యంత వెనుకబడి ఉన్నాయి. 2,083 కాలేజీలుంటే కేవలం 260(12%) మాత్రమే ఇప్పటి వరకు న్యాక్ గుర్తింపు దక్కించుకున్నాయి. దీంట్లో 90 వరకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలే ఉన్నాయి. ఈ విషయాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఇటీవలే వెల్లడించింది.