హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : ఎప్‌సెట్ సహా అన్ని రకాల ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రాల అడ్రస్‌ను విద్యార్థులు సులభంగా తెలుసుకునేందుకు క్యూ ఆర్‌కోడ్ ముద్రిస్తున్నామని పేర్కొన్నారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, లా, ఎంబీఏ, ఎంసీ ఏ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను ఉన్నత విద్యామండలి ఇటీవలే ప్రారంభించింది. ప్రవేశ పరీక్షలు నిర్వహిం చే వర్సిటీలను ఖరారుచేయడమే కాకుండా కన్వీనర్లను సైతం నియమించింది. పరీక్షల షెడ్యూల్‌ను సైతం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో బాలకిష్టారెడ్డి ఆదివారం ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. ఎప్‌సెట్ వెబ్‌కౌన్సెలింగ్‌లో ఈ ఏడాది మరో విడత కౌన్సెలింగ్‌ను జోడించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.
అన్ని రకాల ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు ఫిబ్రవరిలో విడుదల చేస్తామని వెల్లడించారు. డిగ్రీ కోర్సుల్లో 50% అమ్మాయిలే ఉన్నట్టు పేర్కొన్నారు. ఫస్టియర్‌లో 2,05,140 మంది చేరితే, వీరిలో 1,08,941 మంది అమ్మాయిలే ఉ న్నట్టు తెలిపారు. అన్ని వర్సిటీల్లో కామన్ క్రెడిట్ విధానం అమలుకు నిర్ణయించి, డిగ్రీ క్రెడిట్లను 142గా ఖరారు చేశామని తెలిపారు. డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌తోపాటు ైస్టెపెండ్ను కూడా అందజేస్తామని తెలిపారు. విద్యార్థులకు నైపుణ్యాలు కల్పించడం కోసం నాస్కామ్ తో, ఫార్మా పరిశ్రమల్లో అవకాశాల కల్పనకు బల్క్‌డ్రగ్ మాన్యుఫ్రాక్చరర్స్ అసొసియేషన్తో, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రా మ్స్ కోసం టీశాట్ సంస్థతో, విద్య సహకారం, ఉపాధి, ఆవిష్కరణల కోసం యూనివర్సిటీ ఆఫ్ శాన్డియాగోతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు.