Python | హైదరాబాద్ : రైలు వాష్‌రూమ్‌లోకి దూరిన ఓ కొండ చిలువ ప్రయాణికులను ఆందోళనకు గురి చేసింది. కొండచిలువను స్నేక్ క్యాచర్లు పట్టుకున్నారు. ఈ ఘటన అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో వెలుగు చూసింది.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారుల కథనం ప్రకారం.. అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎస్2 కోచ్ వాష్‌రూమ్‌లో ఓ కొండచిలువ ప్రత్యక్షమైంది. దీంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు టీటీఈకి సమాచారం అందించారు. ఈ సమయంలో రైలు డోర్నకల్ దాటి విజయవాడ వైపు వెళ్తుంది. కొండచిలువ వాష్‌రూమ్‌లో ఉన్న విషయాన్ని ఖమ్మం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందానికి టీటీఈ తెలియజేశాడు. రైలు ఖమ్మం చేరుకోగానే స్నేక్ క్యాచర్ మస్తాన్ ఆ పైథాన్‌ను బంధించాడు. దీంతో రైల్వే ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్పీఎఫ్ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నందుకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.