Python | నల్లబెల్లి : ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్లో కొండచిలువ ప్రత్యక్షమైంది. ఇటీవల అధికారులు కెనాల్లోకి సాగునీరు విడుదల చేశారు. ఆ సమయంలో కాలువలోకి వచ్చిన కొండచిలువ.. నల్లబెల్లి గ్రామ సమీపంలోని కెనాల్ వద్ద చిక్కుకుపోయింది. అయితే అధికారులు కెనాల్‌కు నీటి విడుదల ఆపడంతో.. కొండచిలువ కాలువ లోపలి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది.
కొండచిలువను గమనించిన రైతులు, స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మేడేపల్లి ఫారెస్ట్ సెక్షన్ అధికారి గుగులోత్ సోమా నాయక్ తన సిబ్బందితో వచ్చి కొండచిలువను స్వాధీనం చేసుకున్నారు. ఈ కొండచిలువ 12 ఫీట్ల పొడవు ఉందని అధికారులు తెలిపారు. కొండచిలువను మండలంలోని కొండాపూర్ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు రఘురాం, చంద్రమౌళి తో పాటు పిట్టల రమేష్, సాల్మన్, జక్కుల రవి, గ్రామస్తులు పాల్గొన్నారు.