సమగ్రశిక్షా అదనపు డైరెక్టర్‌గా పీవీ శ్రీహరి
పాఠశాల విద్యాశాఖలో ఏండ్లుగా పాతుకుపోయిన వారిని ప్రభుత్వం బదిలీ చేసింది. తాజా బదిలీల్లో స్థాన చలనం కల్పించింది. సర్కార్ శనివారం వేర్వేరు జీవోలు విడుదల చేసింది. సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ అదనపు డైరెక్టర్‌గా పీవీ శ్రీహరికి పోస్టింగ్ ఇచ్చింది.
- పాఠశాల విద్యాశాఖలో బదిలీలు
- ఐదుగురు ఏడీలు, ఏడుగురు జేడీలు, నలుగురు డీఈవోలకు స్థానచలనం
హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యాశాఖలో ఏండ్లుగా పాతుకుపోయిన వారిని ప్రభుత్వం బదిలీ చేసింది. తాజా బదిలీల్లో స్థాన చలనం కల్పించింది. సర్కార్ శనివారం వేర్వేరు జీవోలు విడుదల చేసింది. సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ అదనపు డైరెక్టర్‌గా పీవీ శ్రీహరికి పోస్టింగ్ ఇచ్చింది. ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్‌గా ఉన్న ఆయన్ను, సమగ్రశిక్షా ప్రాజెక్ట్ ఏడీగా బదిలీ చేసింది. ఇదే పోస్టులో ఉన్న రాధారెడ్డిని బదిలీ చేసి, ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణాసంస్థ డైరెక్టర్‌గా నియమించింది. మధ్యాహ్న భోజన పథకం అడిషనల్ డైరెక్టర్‌గా సీహెచ్ రమణకుమార్, తెలంగాణ గురుకుల విద్యాలయాల సొసైటీ డైరెక్టర్‌గా జీ ఉషారాణిని నియమించింది. మరో అడిషనల్ డైరెక్టర్ (కో ఆర్డినేషన్) కే లింగయ్యను ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్‌గా నియమించడమే కాకుండా ప్రభుత్వ పరీక్షల విభాగం(ఎస్సెస్సీ బోర్డు) డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలప్పగించింది.
హైదరాబాద్ ఆర్జేడీగా సోమిరెడ్డి
పాఠశాల విద్యాశాఖ హైదరాబాద్ ఆర్జేడీగా ఎం సోమిరెడ్డిని ప్రభుత్వం నియమించింది. వరంగల్ ఆర్జేడీగా ఈ విజయలక్ష్మికి పోస్టింగ్ ఇచ్చారు. జేడీ (సర్వీసెస్) బీ వెంకటనర్సమ్మ, ఓపెన్ స్కూల్ జేడీగా పీ రాజీవ్, మాడల్ స్కూల్ జేడీగా కే సత్యనారాయణరెడ్డికి పోస్టిం గ్ ఇచ్చారు. సత్యనారాయణరెడ్డికి అడిషనల్ డైరెక్టర్ (కో ఆర్డినేషన్)గా అదనపు బాధ్యతలప్పగించారు. సమగ్రశిక్ష జేడీ-1గా పీ మదన్ మోహన్, సమగ్రశిక్షా జేడీ-2గా ఏ ఉషారాణికి పోస్టింగ్ ఇచ్చారు.
డీఈవోలకు స్థానచలనం..
నలుగురు డీఈవోలను సైతం ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ డీఈవో రోహిణిని సంగారెడ్డి డీఈవోగా బదిలీచేశారు. అక్క డ డీఈవోగా ఉన్న వెంకటేశ్వర్లును రంగారెడ్డి, మంచిర్యాల డీఈవో యాదయ్యను హైదరాబాద్ డీఈవోగా బదిలీ చేసి పోస్టింగ్ ఇచ్చారు. టెట్ సెల్లో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న రేవతిరెడ్డికి మాడల్ స్కూల్ డిప్యూటీ డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. పలువురు డిప్యూటీ ఈవోలను బదిలీ చేసి, డీఈవోలుగా అదనపు బాధ్యతలప్పగించారు. రేణుక(మేడ్చల్ – మల్కాజిగిరి), విజయకుమారి(మహబూబ్‌నగర్), సుశీందర్‌రావు(నల్లగొండ), వాసంతి( భద్రాద్రి కొత్తగూడెం), భిక్షపతి(ములుగు, యాదాద్రి డీఈవో-ఎఫ్ఏసీ) అప్పగించారు. మరికొందరు అసిస్టెంట్ డైరెక్టర్లకు డీఈవోలుగా అదనపు బాధ్యతలప్పగించారు. శాస్త్రి(సిద్దిపేట), ప్రవీణ్(మెదక్), అబ్దుల్ ఘనీ(వికారాబాద్), వెంకటేశ్వర్‌రెడ్డి(వనపర్తి), మల్లికార్జున్ (కామారెడ్డి)కు డీఈవోలుగా అదనపు బాధ్యతలప్పగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

