హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 17వ వర్ధంతి సంస్మరణ సభను తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ నెల 23వ తేదీన పీవీ వర్ధంతి సందర్భంగా పీవీ జ్ఞానభూమి, పీవీ మార్గ్(నెక్లెస్ రోడ్డు)లో నివాళులర్పించనున్నారు. ఉదయం 9 గంటలకు పుష్పాంజలి ఘటించనున్నారు. ఉదయం 10 గంటలకు వైద్య శిబిరం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు పీవీ కుటుంబ సభ్యులు అన్నదానం చేయనున్నారు.