సంస్థాన్ నారాయణపురం, జూలై 7: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామ చేనేత కళాకారులు తమ నైపుణ్యంతో ప్రపంచ ఖ్యాతిపొందారు. పుట్టపాక చేనేత కళాకారులు తయారు చేసిన తేలియా రుమాలుతోపాటు డబుల్ ఇక్కత్ డాబిబోన్ చీర, డబుల్ ఇక్కత్ డాబిబోన్ దుప్పటితోపాటు పలు వస్ర్తాలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటివరకు పుట్టపాక చేనేత కళాకారుల నైపుణ్యానికి రెండు పద్మశ్రీ అవార్డులతోపాటు పలు జా తీయ అవార్డులు వరించాయి. తా జాగా మరోసారి జాతీయ చేనేత అవార్డులకు ఎంపికయ్యారు. జాతీయ చేనేత మార్కెటింగ్ విభాగంలో గజం నర్మద నరేందర్, యంగ్ వీవర్ విభాగంలో గూడ పవన్‌కు జాతీయ అవార్డు వరించింది. ఆగస్టు 7న రాష్ట్రపతి చేతుల మీదుగా వీరు అవార్డులు అందుకోనున్నారు.