హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో) తరఫున వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ను బరిలో దింపనున్నట్టు జాక్టో ప్రకటించింది. సోమవారం బేగంపేట హరితప్లాజాలో జాక్టో చైర్మన్ సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి కృష్ణుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు సంఘాల నేతలు పాల్గొని పూల రవీందర్‌ను అభ్యర్థిగా ఖరారు చేశారు.