హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : డాటాసైన్స్తో ప్రజా రవాణాను పటిష్టం చేయవచ్చని డాటాసైన్స్, మెషిన్ లెర్నింగ్ నిపుణుడు శరత్ కాటిపల్లి అన్నారు. లీడర్షిప్ టాక్స్‌లో భాగంగా గురువారం హైదరాబాద్ బస్‌భవన్‌లో నిర్వహించిన ‘ప్రజారవాణా వ్యవస్థలో డాటాసైన్స్, మెషి న్ లెర్నింగ్ వినియోగం’ అంశంపై శరత్ ప్రసంగించారు. డాటాకు అనుగుణంగా రియల్ టైమ్‌లో మెరుగైన రవాణా సేవలను అందించవచ్చని తెలిపారు.
మెసేజ్, మెసెంజర్, మెకానిక్స్, మెషినరీ కాన్సెప్ట్స్‌తో సంస్థ ను ఉన్నతస్థాయికి ఎలా తీసుకెళ్లవచ్చో వివరించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. డాటాసైన్స్తో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు టీజీఎస్ఆర్టీసీ కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సీవోవో రవీందర్, జేడీ అపూర్వరావు, ఈడీ మునిశేఖర్, కృష్ణకాంత్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ప, ఉషారాణి, వెంకన్న, ఆర్ఎం లు, డీఆర్ఎంలు, డీఎంలు పాల్గొన్నారు.