TS Holidays | హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాదికి సంబంధించిన సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024లో 27 సాధారణ సెలవులు, 25 ఐచ్ఛిక సెలవులు ఉండనున్నట్టు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త ఏడాది సందర్భంగా జనవరి 1న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇందుకు బదులుగా ఫిబ్రవరి 10న రెండో శనివారాన్ని పనిదినంగా ఉత్తర్వుల్లో పేరొన్నది.