తొర్రూరు, జూన్ 20 : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డికి ప్రజల నుంచి మరోసారి నిరసనసెగ తగిలింది. ప్రతిచోటా స్థానికులు నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకే కేటాయించారని ఆరోపించారు. చీకటాయపాలెంలో కాంగ్రెస్ జెండా ఆవిషరణకు యశస్వినీరెడ్డి హాజరయ్యారు. అంతకుముందే జెండా కర్ర నేలపై పడిపోయింది.
బూర్గంపహాడ్, జూన్ 20 : తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక గ్రామస్థులు శుక్రవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కారు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
తాళ్లగొమ్మూరు నుంచి వస్తుండగా సారపాక గ్రామస్థులు ఆయన కారు ఎదుట బైఠాయించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లి పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చామని, ఈవోకు సైతం సమస్యను వివరించినా పరిష్కారం కాలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే హామీతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.