హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయుల పదోన్నతులపై వేసిన కేసును ఉపసంహరించుకొని, సహకరించాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య రంగారెడ్డి జిల్లా టీచర్లను కోరారు.
ఇప్పుడు పదోన్నతులు నిలిచిపోతే భవిష్యత్తులో నష్టం జరుగుతుందని తెలిపారు. దీంతో ఉపాధ్యాయులకు నష్టం చేసినవారవుతారనే విషయాన్ని కేసు వేసిన బాధ్యులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మల్టిజోన్-1లోని టీచర్లకు పదోన్నతులు లభిస్తుండగా, మల్టిజోన్-2లో నిలిచిపోవడం ఇక్కడి టీచర్లకే నష్టదాయకమని పేర్కొన్నారు.