హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : వేసవి సెలవుల్లో మాడల్ స్కూల్ టీచర్లకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తిచేసింది.
సోమవారం రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు, ప్రధాన కార్యదర్శి దొడ్డ ఆంజనేయులు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణాను సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.