హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 15 మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నూతనం గా ఏర్పాటు చేసిన నర్సింగ్ కాలేజీల్లో అడ్మిషన్లను వేగవంతం చేయాలని వై ద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. నర్సింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు, వసతులపై శనివారం ఆయన హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జనగాం, భూ పాలపల్లి, కరీంనగర్, కొడంగల్, ఆందోల్, ఆసిఫాబాద్, మె దక్, కుత్బుల్లాపూర్, ములుగు, నారాయణపేట, నిర్మల్, రామగుండం, మహేశ్వరం, నర్సంపేట, యాదాద్రిలో ఏర్పాటు చేసి న నర్సింగ్ కాలేజీల్లో వసతులపై ఆరా తీశారు. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, కమిషనర్ ఆర్వీ కర్ణన్, టీజీఎంస్ఐడీసీ ఎండీ హేమంత్ సహాదేవ్రావు పాల్గొన్నారు.
అన్ని గురుకులాల్లో కోడింగ్ హబ్ ; ఎస్సీ గురుకులాల సెక్రటరీ వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 268 గురుకుల పాఠశాలల్లో కోడింగ్ విధానం అమలు చేస్తున్నారని, దీంతో అన్ని గురుకులాల్లో కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ ఎస్సీ గురుకుల సెక్రటరీ తెలిపారు. శనివా రం ప్రకటన విడుదల చేశారు. కోడింగ్ పేరుతో కొంతమంది నిధులు దుర్వినియోగం చేసి, ఇప్పుడు వారే.. ఆ గురుకుల పాఠశాల మూతపడుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు సెక్రటరీ పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలు మూత పడడం లేదని, మొత్తం 268 పాఠశాలల్లో విద్యార్థుందరికీ ఉచితంగా విద్య అందిస్తున్నట్టు ఆయన తెలిపారు.