హైదరాబాద్ మే 17 (నమస్తేతెలంగాణ): ‘కరీంనగర్ వేదికగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన సింహగర్జన సభ ఉద్యమ చరిత్రలో మహోజ్వల ఘట్టం. 24 ఏండ్ల క్రితం హైదారాబాద్ నుంచి కరీంనగర్ వరకు 9 గంటలపాటు నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడం గర్వకారణంగా భావిస్తున్నాను’ అని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం ఎక్స్ వేదికగా ఆనాటి స్మృతులను పంచుకున్నారు. దార్శనికుడైన కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాకారమైందని పేర్కొన్నారు.
‘నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహోన్నత నేతకు వందనం’ అంటూ ట్వీట్ చేశారు. వివిధ పత్రికల్లో ప్రచురితమైన కథనాలు, చారిత్రక సభలో కేసీఆర్ మాట్లాడిన చిత్రాలను ట్యాగ్ చేస్తూ ఆనాటి క్షణాలను గుర్తుచేసుకున్నారు.