హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) చైర్మన్లకు గౌరవ వేతనంతోపాటు ప్రోటోకాల్ కల్పించాలని పలువురు చైర్మన్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మంత్రి జగదీశ్‌రెడ్డిలకు విజ్ఞప్తి చేశారు. అపెక్స్ బ్యాంక్ చైర్మన్ రవీందర్రావు, వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అధ్యక్షతన పలువురు చైర్మన్లు మంగళవారం వారికి వినతిపత్రం అందించారు.