జనగామ : స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో(Independence Day) ప్రొటోకాల్ వివాదం(Protocol Controversy) రచ్చరేపుతున్నది. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యేలా యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా వ్యతిరేకత వస్తున్నది. తాజాగా జనగామ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో స్టేజి పైకి ఎక్కుతున్న మున్సిపల్ ఛైర్ పర్సన్ జమునను ప్రోటోకాల్ లేదంటూ అధికారులు అడ్డుకున్నారు.
దీంతో జమునను వేదిక పైకి అనుమతించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరిన అనంతరం ఆమెను వేదిక పైకి కలెక్టర్ అనుమతించారు. కాగా, కామారెడ్డిలో స్వాతంత్ర దినోత్సవం కార్యక్రమంలో ప్రోటోకాల్‌కు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ స్టేజీపై కూర్చోవడం విమర్శలకు దారితీసింది. ఇది ప్రభుత్వ కార్యక్రమమా లేక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమ ఉద్యోగాన్ని కాపాడుకునేందుకు అధికార పార్టీకి చెందిన నేతలకు వంతపాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం సరైన విధానం కాదన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతున్నది.
జనగామ జిల్లా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్ వివాదం
జనగామ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో స్టేజి పైకి ఎక్కుతున్న మున్సిపల్ ఛైర్ పర్సన్ జమునను ప్రోటోకాల్ లేదంటూ అడ్డుకున్న అధికారులు.
జమునను వేదిక పైకి… pic.twitter.com/h6WWDU0mKs
— Telugu Scribe (@TeluguScribe) August 15, 2024