హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హా మీ మేరకు దివ్యాంగుల పింఛన్‌ను రూ.4,016 నుంచి రూ.6,016కు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దివ్యాంగులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించారు. ఇచ్చిన హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేశారు.
జోగుళాంబ గద్వాల క లెక్టరేట్ ఎదుట వృద్ధులు, దివ్యాంగులు బైఠాయించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ది వ్యాంగులు చేపట్టిన ధర్నాలో వీహెచ్పీఎస్ జి ల్లా అధ్యక్షుడు కల్లేపల్లి ప్రేమ్‌రాజ్ మాట్లాడు తూ.. పింఛన్ మొత్తాన్ని పెంచకపోతే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) ఆధ్వర్యంలో దివ్యాంగులు నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ములుగు కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు, వృద్ధులు బైఠాయించారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన ‘చలో ప్రజాభవన్’ కార్యక్రమంలో భాగంగా అఖిల భారత వికలాంగుల హకుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు ప్రజావాణి ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దివ్యాంగుల పెన్షన్‌ను రూ.6,016కు తక్షణమే పెంచాలని కోరారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో దివ్యాంగుల సంఘాల నాయకులు పులిపాటి శ్రీనివాస్, శివరాత్రి రాజయ్య, అందే దయామని గోవింద్, శంకర్, బాలకృష్ణ పాల్గొన్నారు.