నల్లగొండ సిటీ, మే 28 : నల్లగొండ పట్టణం చుట్టూ నిర్మించే రింగ్‌రోడ్డులో భూములు, ఇండ్లు కోల్పోతున్న పలువురు బాధితులు నష్టపరిహారం చెల్లించాలని మంగళవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
రైతుల పొలాల్లో నుంచి రోడ్డు నిర్మాణానికి తాత్కాలిక మార్క్ చేయడంతోపాటు నల్లగొండ మండలం కత్తాల్గూడ వద్ద వంతెన నిర్మాణ ప్రాంతంలో మట్టి నమూనా కోసం చేసే డ్రిల్లింగ్ యంత్రాలను సోమవారం అడ్డుకున్నారు.