హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): సచివాలయంలోకి హెచ్వోడీల నుంచి 12.5% ఉద్యోగులను తీసుకొనేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులపై రచ్చ జరగుతున్న ది. ప్రభుత్వ నిర్ణయాన్ని టీజీవో, టీఎన్జీ వో సంఘాలు స్వాగతించగా, బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభు త్వ ఉత్తర్వులను నిరసిస్తూ సచివాలయ ఉద్యోగులు శుక్రవారం నిరసన తెలిపా రు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల కమిషనరేట్లు, డైరెక్టరేట్ల నుంచి సచివాలయంలోకి 12.5% కోటాను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నది.
హెచ్వోడీ ఉద్యోగుల వాదనలు
ఇంతకాలం ఈ కోటాను అమలు చేయకపోవడంతో సూపరింటెండెంట్లు, సీనియ ర్ అసిస్టెంట్లు.. డైరెక్టరేట్లు, కమిషనరేట్లలో నే పనిచేయాల్సి వస్తున్నది. సచివాయలం లో పనిచేసే అవకాశం దక్కడంలేదు.
సచివాలయ ఉద్యోగుల వాదనలు
మేం 12.5% కోటాకు వ్యతిరేకం కాదు. అయితే, ఈ కోటా అమల్లో గతంలో అనేక ఉల్లంఘనలు జరిగాయి. దీంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. హెచ్వోడీల నుంచి 12.5% కోటాకు మించి 40-50% వరకు సచివాలయంలోకి వచ్చారు. పలు శాఖల్లో కోటాకు మించి ఉద్యోగులున్నారు.