Stray Dogs | రేవంత్ అంకుల్ రక్షణ కల్పించండి.. కుక్కల నుంచి కాపాడండి ప్లీజ్.. కొంపల్లిలో చిన్నారుల నిరసన
‘కాలనీలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది.. రోడ్లపై వెళ్లాలంటేనే భయమేస్తుంది.. ఇప్పటికే రెండేండ్లలో ఎందరో మా తోటి బాలలు కుక్కల దాడుల్లో తీవ్ర గాయాలపాలయ్యారు.. అయినా మా కాలనీ అధికారులు పట్టించుకోవడం లేదు.. రేవంత్ అంకుల్ మీరే మమ్మల్ని కాపాడండి.’
- వీధి కుక్కల బారినపడి రెండేండ్లలో 75 మందికిపైగా గాయాలపాలు
- ప్లకార్డులు చేబూని చిన్నారుల నిరసన
- కొంపల్లి మున్సిపల్ కమిషనర్‌పై స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు
- పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ ఎదుట నార్త్ ఎన్సీఎల్ కాలనీ బాలల ప్రదర్శన
Stray Dogs | కుత్బుల్లాపూర్, జూలై 21: ‘కాలనీలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది.. రోడ్లపై వెళ్లాలంటేనే భయమేస్తుంది.. ఇప్పటికే రెండేండ్లలో ఎందరో మా తోటి బాలలు కుక్కల దాడుల్లో తీవ్ర గాయాలపాలయ్యారు.. అయినా మా కాలనీ అధికారులు పట్టించుకోవడం లేదు.. రేవంత్ అంకుల్ మీరే మమ్మల్ని కాపాడండి.’ అంటూ కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నార్త్ ఎన్సీఎల్ కాలనీ చిన్నారులు వేడుకుంటున్నారు. వీధికుక్కల బెదడను తట్టుకోలేక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న ఆ చిన్నారులు పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ మెట్లెక్కారు. కొంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ శ్రీహరిపై ఏకంగా పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ అంకుల్ మీరైనా స్పందించండి.. కొంపల్లి మున్సిపాలిటీలో వీధికుక్కల స్వైరవిహారానికి అడ్డుకట్ట వేయండి.. మా ప్రాణాలకు రక్షణ కల్పించండి.. అంటూ ప్లకార్డులను చిన్నారులు ప్రదర్శిస్తూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్థానిక అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
పలువురు బాలలకు తీవ్రగాయాలు
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నార్త్ ఎన్సీఎల్ కాలనీలో రెండేండ్ల నుంచి సుమారు 75 మందికి పైగా బాలలు, వృద్ధులు, మహిళలు తీవ్రగాయాల పాలయ్యారని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ ఎదుట కాలనీవాసులు, చిన్నారులు తెలిపారు. ఓ చిన్నారిని కరిచిన కుక్కను తరమబోయిన తల్లిపై దాడి చేసిందని, పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్లినా వెంబడించి మరీ కరిచిందని వారు తెలిపారు. బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ కార్మికుడి ఐదేండ్ల కూతురు గుడిసె బయట ఆడుకుంటుండగా వీధికుక్కలు కర్కశంగా దాడి చేయగా కుడిచెయ్యి, కుడి కాలు తీసేయాల్సి వచ్చిందని వివరించారు. ఓ బాలుడి ముఖం ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వచ్చిందని, నడుచుకుంటూ వెళ్తున్న మరో వ్యక్తిపై దాడి చేయగా కుడికాలు తోడభాగాన్ని పీకిన ఘటనలు చోటుచేసుకున్నాయని చెప్పారు. వీధి కుక్కల బెడదపై అనేకమార్లు ఉన్నతాధికారులు, కొంపల్లి మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి వీధికుక్కల బారి నుంచి కాపాడాలని చిన్నారులు వేడుకుంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

