హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 1997 బ్యాచ్‌కు చెందిన నలుగురు ఐఏఎస్ అధికారులకు అబో సూపర్ టైం స్కేల్ (లెవల్-15 పే మ్యాట్రిక్స్) పదోన్నతి కల్పించారు. వీరిలో హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్, ఇండస్ట్రీస్, కామర్స్ విభాగం కార్యదర్శి శైలజా రామయ్యర్, మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి అహ్మద్ నదీమ్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ ఎన్ శ్రీధర్, కోఆపరేషన్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ కమిషనర్ ఎం వీరబ్రహ్మయ్య ఉన్నారు. 2009 బ్యాచ్‌కు చెందిన నలుగురు ఐఏఎస్‌లకు గ్రేడ్స్కేల్ (లెవల్-13 పే మ్యాట్రిక్స్) పదోన్నతి లభించింది. వీరిలో ఎక్సైజ్‌శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ, ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ (ప్రొటోకాల్) ఎస్ అరవిందర్‌సింగ్, మరో జాయింట్ సెక్రటరీ (ఈఎప్ఎస్అండ్టీ) ఎం ప్రశాంతి ఉన్నారు.
2013 ఐఏఎస్ బ్యాచ్‌లో ఎనిమిది మందికి..
2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారుల్లో ఎనిమిది మందికి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్(లెవల్-12 పే మ్యాట్రిక్స్) పదోన్నతి లభించింది. వీరిలో మహబూబాబాద్ కలెక్టర్ కే శశాంక, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ శ్రుతి ఓజా, జనగామ కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, యువజన సర్వీస్‌ల డైరెక్టర్ వీ వెంకటేశ్వర్లు, సంగారెడ్డి కలెక్టర్ ఎం హనుమంతరావు, రంగారెడ్డి కలెక్టర్ డీ అమోయ్‌కుమార్, సీసీఎల్ఏ సెక్రటరీ కే హైమావతి, విద్యాశాఖ డిప్యూటీ సెక్రటరీ ఎం హరిత ఉన్నారు. 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అద్వైత్ కుమార్‌సింగ్‌కు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ (లెవల్-12 పే మ్యాట్రిక్స్) పదోన్నతి కల్పించారు. ఈయన ప్రస్తుతం డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీస్‌లో ఉన్నారు.
ఎనిమిది మందికి సీనియర్ టైం స్కేల్ పదోన్నతి
వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 2017, 2018 బ్యాచ్‌లకు చెందిన ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు సీనియర్ టైం స్కేల్ (లెవల్-11, పే మ్యాట్రిక్స్) హోదా కల్పిస్తూ పదోన్నతులు ఇచ్చారు. వీరిలో ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్‌భాషా షేక్, భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జోగుళాంబ గద్వాల జిల్లా అడిషనల్ కలెక్టర్ కోయ శ్రీహర్ష, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, నిర్మల్ అడిషనల్ కలెక్టర్ బూర్ఖదే హేమంత్ సహాద్యోరావు, మహబూబ్‌నగర్ అడిషనల్ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఉన్నారు. వీరందరికీ పదోన్నతితోపాటు యథాతథ స్థానాల్లోనే కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.