ఆమోదించిన డీపీసీలు.. నేడో రేపో ఉత్తర్వులు
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ ): సచివాలయంలోని పలువురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు డీపీసీలు ఆమోదం తెలిపాయి. సోమవారం ఒక్కరోజే ఐదు డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ కమిటీ (డీపీసీ)లు సమావేశమై 131మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు ఆమోదం తెలిపాయి. సీఎస్ సోమేశ్‌కుమార్ చైర్మన్‌గా ఉన్న డీపీసీ అదనపు కార్యదర్శులుగా 5, సంయుక్త కార్యదర్శులుగా 8 మందికి పదోన్నతలు కల్పించేందుకు ఆమోదం తెలపగా, సునీల్‌శర్మ చైర్మన్ నేతృత్వంలోని డీపీసీ ఉపకార్యదర్శులుగా 20 మందికి, వికాస్‌రాజ్ చైర్మన్‌గా ఉన్న డీపీసీ సహాయ కార్యదర్శులుగా 33, విభాగాధిపతులుగా (ఎస్వో) 65 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు ఆమోదముద్ర వేశాయి. వీరందరికీ పదోన్నతులు కల్పిస్తూ ఒకటిరెండు రోజుల్లో జీవోలు విడుదలయ్యే అవకాశముంది.